విజయవంతంగా గజ్వెల్‌ చెస్‌ టోర్నమెంట్‌

20-09-2026 | 07:34pm

చిన్నారుల్లో మేధో వికాసానికి చెస్‌ దోహదం

గజ్వెల్‌, సెప్టెంబర్‌ 20: గజ్వెల్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్‌ టోర్నమెంట్‌ (Chess tournament)విజయవంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చిన్నారుల్లో చెస్‌పై ఆసక్తి పెంపొందించడం, ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో చెస్‌ క్రీడను అభివృద్ధి చేయడం లక్ష్యంగా టోర్నమెంట్‌ను నిర్వహించారు.

టోర్నమెంట్‌లో చెన్న ప్రణీత్‌ 5 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించగా, అనుముల పవన్‌ కుమార్‌, చేవూరి విశ్లేష్‌, జి. నీరవ్‌ 4 పాయింట్లతో తదుపరి స్థానాల్లో నిలిచారు. అమృతవర్షిణి, షేక్‌ మహమ్మద్‌ అబేద్‌ 3.5 పాయింట్లు, వెంకటేష్‌ (బి), గౌటి మనోజ్‌ కుమార్‌ 3 పాయింట్లతో టాప్‌-8లో నిలిచారు. ఈ సందర్భంగా గజ్వెల్‌ చెస్‌ అకాడమీ ఫౌండర్‌ రెడ్డి రెడ్డి హరీష్‌ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల్లో ఏకాగ్రత, తార్కిక ఆలోచన, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడంలో చెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చెస్‌ను విస్తరించి ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ జైపాల్‌,   పీఈటీ నగేష్‌, ఆర్గనైజర్ వినయ్‌, జి. బాలాజీ, శంకర్‌, తోట శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు