9 June, 2026 | 5:49 PM

సుల్తానాబాద్ పురపాలక సమావేశంలో 29 అంశాలపై తీర్మానం

29-04-2026 08:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘ సాధారణ సమావేశం కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించనైనది, ఈ సమావేశంలో 29 అంశాలపై చర్చించి ఏకగ్రీవముగా ఆమోదించి తీర్మానించినారు. ఇందులో భాగంగా  పట్టణములో వివిధ వార్డులలో సిసి డ్రైన్, సిసి రోడ్డుల నిర్మాణం చేయుట కొరకు, 1 వ వార్డులో గల మహిళా సంఘ భవననిర్మాణం పూర్తిచేయుటకు, పలు వార్డులలో బోర్వెల్  వేయుటకు, పట్టణములో వీధి దీపాలకు సంబంధించిన సమస్యలపై ఇట్టి సమావేశములో పాల్గొన్న విద్యుత్ శాఖ అధికారులకు పరిష్కరించుటకు గాను తెలుపనైనది,  ఇందిరమ్మ గృహ నిర్మాణముల విషయములో, బిల్లుల చెల్లింపు విషయములో సంబందిత ఎ ఇ కి తగు సూచనలు ఇచ్చుచు త్వరితగతిన బిల్లులు చెల్లింపు చేయుటకు అవసరమైన చర్యలు గైకొనుటకు ఆదేశించనైనది.