సర్దార్ 2లో సూర్య.. విలన్‌లా మెప్పిస్తారు
హీరో కార్తి(Hero Karthi) తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్ 2(Sardar 2)’తో వస్తున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేక ర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు.
టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తి మాట్లాడుతూ.. “ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. ఈ సినిమాలో డాన్స్ లేదు.. యాక్షన్ ఉంటుంది. గర్ల్ పవర్ చూడబోతున్నారు. సూర్యను ప్రేక్షకులు వేరే రకంగా ఇందులో చూస్తారు. అందరూ ఎంజాయ్ చేసే విలన్‌లా చేశారు. ‘హిట్ 4’ వస్తుంది. అంతకుముందు కళ్యాణ్ శంకర్‌తో సినిమా కూడా వస్తుంది. త్వరలో చాలా తెలుగు సినిమాలు చేస్తా” అన్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్(Actress Malavika Mohanan) మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. కార్తీక్ చాలా జెంటిల్‌మేన్. సూర్య కూల్ విలన్. చాలా మంచి యాక్షన్, యాక్షన్ డ్రామా ఉన్న సినిమా ఇది” అని తెలిపింది. ‘సర్దార్ 2 నేను చేస్తున్న ఫస్ట్ యాక్షన్ జానర్. ఈ సినిమా అందరికీ వినోదం పంచుతుంద’ని ఆషికా రంగనాథ్ చెప్పింది. దర్శకులు బోయపాటి శ్రీను, కళ్యాణ్ శంకర్, హీరో అడివి శేష్, ఎస్‌జే సూర్య, నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ, అనిల్ సుంకర కూడా ఈ వేడుకలో మాట్లాడారు.