స్వీట్ హౌస్ ను ప్రారంభించిన నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్

12-09-2026 | 06:13pm

నేరేడుచర్ల,సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): నేరేడుచర్ల పట్టణం మిర్యాలగూడ బస్ స్టాప్(Miryalaguda Bus Stop) నందు నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాజీ స్వీట్ హౌస్ ను నేరేడుచర్ల  మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతకు అనేక రంగాలలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయని   స్వయం ఉపాధితో తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా నలుగురికి ఉపాధి  కల్పించేలా ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని స్వీట్ హౌస్ యజమాని అంబటి వెంకట బ్రహ్మాజీ కి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యఅతిథిగా  ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్  గరిడేపల్లి సర్పంచ్  మేకపోతుల వెంకటమ్మ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాచకొండ రామన్న ,వీరబాబు, అజ్మతుల్లా,ముక్కంటి, తాళ్లూరి లక్ష్మీనారాయణ, చింతకాయల రాము,  ఆత్కూర్ రమేష్, ఊట్కూరి నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు