ఉదయం నుంచే అలర్ట్

30-09-2026 | 07:37am

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(Telangana Weather Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉదయం 8.30 గంటలలోపు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్ష సూచన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert Telangana) జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఏపీలోనూ వర్ష సూచన

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ(Andhra Pradesh Rain Alert) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(AP Weather) తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం కనిపించే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు