ఎర్రవెల్లిలో ఉద్రిక్తత.. కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద భారీ భద్రత
08-09-2026 | 10:05am
గజ్వేల్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(Thatha Madhu) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గజ్వేల్(Gajwel) నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు పిలుపునిచ్చి, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి సిద్ధమైంది.దీంతో పోలీసులు ఎర్రవెల్లిలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు. ఫామ్‌హౌజ్‌కు వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేసి, వాహనాలతో పోలీసులు పహారా కాస్తున్నారు. మర్కుక్ పోలీస్‌స్టేషన్ వద్ద కూడా అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సిద్ధంగా ఉంచారు.మరోవైపు ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని పోలీసులు తొలగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.