ఉజ్జయినిలో ఉద్రిక్తం
- షాహీ మసీదును తొలగించొద్దని నిరసన
- పోలీసులపై రాళ్లు.. టీయర్‌గ్యాస్ ప్రయోగం
- 21 మందికి పైగా అరెస్ట్.. ఏడుగురిపై కేసు నమోదు
- యంత్రాంగంతో మసీదు నిర్వహణ వర్గం డీల్
ఇండోర్, సెప్టెంబర్ 28: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో(Madhya Pradesh) సింహస్థ కుంభమేళా(Simhastha Kumbh Mela) 2028 ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయినిలో(Ujjain) రోడ్డు విస్తరణ కోసం చారిత్రక షాహీ మసీదు(Shahi Masjid) కూల్చివేత సోమవారం ఉద్రిక్తితకు దారితీసింది. మసీదును తొలగింపునకు వ్యతిరే కంగా ఉద యం నిరసనలు మిన్నంటాయి. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టీయర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 21 మందికి పైగా అరెస్ట్ చేయగా, వీరిలో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ ఘటనపై దాఖలైన రెండు రిట్ అప్పీళ్లను మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) సోమవారం పరిష్కరించింది. మసీదు నిర్వహణ వర్గం, ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2028 సంవత్సరంలో నిర్వహించే సిం హస్థ కుంభమేళాకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. యాత్రికుల రాకపోకలను సులభతరం చేయడానికి 900 మీటర్ల రహదారిని విస్తరించే ప్రాజెక్ట్‌ను చేపట్టారు. కాంతల్ క్రాసింగ్ నుంచి గోపాల్ మందిర్ వరకు ఉన్న రహదారిని 15 మీటర్ల మేర విస్తరిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతిపాదిత మార్గంలో ఉన్న మొత్తం 272 కట్టడాలను తొలగిస్తున్నారు. వీటిలో 80కి పైగా మతపరమైన కట్టడాలు ఉండగా, వీటిలో ఎక్కువ భాగం ఆలయాలే ఉన్నాయి. వీటిలో షాహీ మసీదులోని కొం త భాగాన్ని కూల్చివేయాలన్న ప్రతిపాదనలు చేశారు. ఈ మసీదు తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం కొందరు నిరసనలకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
ఈ ఘటనలో కొందరిని అరెస్టు చేయగా, మరో 15 మంది ని అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను షేర్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశా రు. ఈ మసీదు అంశంపై హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుబోధ్ అభ్యంకర్, జై కుమార్ పిళ్లైతో కూడిన ఇండోర్ ధర్మాసనం విచారణ చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన నోటీసుల్లో హామీలు ఆ సంస్థకు కట్టుబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
మసీదు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నందున తొలగించేందుకు ముస్లిం వర్గం అంగీకరిం చిందని, సోమవారం ఉదయం పనులు ప్రారంభమయ్యాయని మున్సిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ రోడ్డు విస్తరణలో మసీదులో 10 శాతం లోపే ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. ముస్లిం వర్గం తరఫు న్యాయవాది కుల్దీప్ పాఠక్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట సుమారు 9.5 అడుగుల తొలగించాలని అధికారులు భావించారు. ఒప్పందం ప్రకారం సుమారు 3 అడుగుల మేర మాత్రమే తొలగించేందుకు నిర్ణయించారు.