23 May, 2026 | 1:31 PM

ఆర్మీ వాహనంపై ఉగ్రదాడిl

29-10-2024 01:05 AM

సెర్చ్ ఆపరేషన్‌లో ముగ్గురిని మట్టుబెట్టిన జవాన్లు

జమ్ముకశ్మీర్, అక్టోబర్ 28: వరుస ఉగ్రదాడులతో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం ఎదోఒకచోట భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా సోమవారం ఉదయం 7గంటల సమయంలో అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. తేరుకున్న అధికారులు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేకున్నారు.