13 July, 2026 | 5:13 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

చిన్నారిని అమ్మకానికి పెట్టిన నిందితులు

22-05-2024 04:47 PM

మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. నిందితులు అప్పుడే పుట్టిన చిన్నారిని అమ్మకానికి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు 3 నెలల చిన్నారిని విక్రయానికి పెట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణానగర్ లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ. 4 లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. నిందితులు రూ. 10 వేలు అడ్వాన్స్ గా కూడా తీసున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.