13 July, 2026 | 5:32 PM

Breaking News

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •  

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత

13-07-2026 04:35 PM

నిర్మల్ జులై 13 (విజయ క్రాంతి): విద్యార్థుల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ అనేక ఆరోగ్య సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కేజీబీవీ పాఠశాల అర్బన్ తనిఖీ చేసి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతినెల చదువుకుంటున్న పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి రక్తహీనత ఇతర అనారోగ్యానికి గురైన వారికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన, ప్రిన్సిపల్ డానియల్. వైద్యులు నైనా రెడ్డి, సిబ్బంది రవీందర్ తదితరులున్నారు.