7 July, 2026 | 3:36 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

వంతెన నిర్మాణంతో 10కిలో మీటర్ల దూరం తగ్గుతుంది

21-03-2025 01:22 AM

పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపల్లి మార్చి 20 (విజయ క్రాంతి) ఓదెల మండలం ప్రజలకు జమ్మికుంట- వరంగల్ పోవాలంటే సుమారు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. 

గురువారం  ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో రూపు నారాయణపేట, విలాసాగర్  మధ్య మానేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన అనంతరం భూ సర్వే త్వరగా చేసి బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అధికారులు త్వరగా సర్వే పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వే నిర్వహించి త్వరలోనే బ్రిడ్జి పనులకు టెండర్ పిలిసి  శంకుస్థాపన చేసుకుందామన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.