నిధులు సమకూర్చిన ఘనత మాదే
- జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఎప్పుడు పోరాడుతాం
- మా హాయంలో ప్రెస్ అకాడమీ భవన నిర్మాణంతో పాటు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు సంపూర్ణంగా ఇప్పించాం
- మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
వికారాబాద్, సెప్టెంబర్- 27 (విజయక్రాంతి): ఉద్యమ భావజాలంతో ఏర్పడిన తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(Telangana Union of Journalists) ఎప్పటికీ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల కోసం పోరాడు తుందని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం వికారాబాద్ జి ల్లా కేంద్రంలోని శివకేశవ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన జిల్లా మహాసభకు ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన టియుడబ్ల్యూజే ఏ రోజు ఏ రాజకీయ పార్టీతో సన్నిహితంగా లేదన్నారు.
తాము ఎప్పటికీ జర్నలిస్టులకు మాత్రమే సన్నిహితులమని వారికి మాత్రమే మిత్రులమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షే మం కోసం వారి హక్కుల సాధన కోసం ఎప్పటికీ పోరాడుతామన్నారు. తాను ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్న సమయంలోనే జర్నలిస్టుల నిధికి రూ. 42 కోట్ల నిధులను మం జూరు చేయించామని తెలిపారు. ఈ నిధులనుండి కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2 లక్షల హార్దిక సహాయం, మామూలు సమయంలో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేయడంతో పా టు ఐదేళ్లపాటు నెలకు రూ. 3000 పెన్షన్ అందించిన ఘనత తమకే దక్కుతుందన్నా రు.
తమ హాయంలోనే హెల్త్ కార్డులు, గ్రా మీణ ప్రాంత జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు లు, ఇంటి స్థలాలు ఇప్పిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రెస్ అకాడమీ భవనాన్ని తన హయాంలోనే నిర్మించినట్లు ఆయన గర్వంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక పథకాలు ప్రకటించిన ఇప్పటివరకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తాను జర్నలిస్టుల కోసం చేసిన కృషి ఏమిటో తెలియని కొందరు రాజకీయ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్లు ఆరోపించారు.
జిల్లా అధ్యక్షుడిగా రవీందర్......
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా కండ్లపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ప్రహ్లాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల కో సం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మారుతి సాగర్, వికారాబాద్ మా జీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చంద్రప్రియ, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, బీఆర్‌ఎస్ నాయకుడు చైతన్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.