8 May, 2026 | 2:52 AM

కత్తిరింపులు పూర్తి !

08-05-2026 01:11 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పె ద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటిం గ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం లో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కా నుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఫైనల్ ఎడిట్‌ను లాక్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ సిని మాకు సంబంధించిన ఫైనల్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతోందీ చిత్రం. షార్ఫ్, ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పేరుపొందిన ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీ తం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ కాగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పలు దక్షిణ భారత భాషలతోపాటు హిందీలో విడుదల కానున్న ఈ సినిమా జూన్ 3 నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీమియర్ షోలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.