పవర్‌పేట సేనాపతి రవి
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ‘70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్’ రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పవర్‌పేట’. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు గురువారం ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సందీప్ కిషన్ రగ్గడ్ పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. స్టైలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూ మ్స్, రా అటిట్యూడ్‌తో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.
‘సేనాపతి రవి’ అనే పాత్ర పేరును రివీల్ చేయ డం ద్వారా ఆ క్యారెక్టర్‌లోని డామినేషన్, ఇంటెన్సిటీని సూచించారు. సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ; డీవోపీ: మదీ; ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక. నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి; రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య.
ఏ లెజెండ్ ఈజ్ బార్న్..
‘శంబాల’ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్టును చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తు న్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా టీమ్ సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం చూస్తుం టే ఇదొక ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రమని అర్థమవుతోంది. ‘ఏ లెజెండ్ ఈజ్ బార్న్’ అంటూ వదిలిన ఈ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుంది.






