రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం..

20-09-2026 | 06:59pm

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర..

నిజాంసాగర్ సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాహుల్ గాంధీని తదుపరి ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో చేపట్టిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా, ఒంగోలు ప్రాంతానికి చెందిన అడ్వకేట్ వెంకటేశ్వర్లు(Advocate Venkateswarlu) ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్‌ రావుపల్లి సమీపంలోని జాతీయ రహదారి 161 వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాకలి సాయిలు, వీరారెడ్డి, గైని దత్తు, గైని జగన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాదయాత్రికుడికి స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు