ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

23-09-2026 | 12:08am

చెన్నూర్, (విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు(District Additional Collector V. Ramulu) అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ లో గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిని సమీక్షించి, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందించిన ఓటర్లకు హియరింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రమంలో సంబంధిత ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు