స్వచ్చ రిక్షాలలో అవినీతి కంపు

20-09-2026 | 07:08pm

గుంజపడుగు హరిప్రసాద్

ముకరంపుర, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ(Karimnagar Municipal Corporation) పరిధిలో వివిధ డివిజన్లలో చెత్త సేకరణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన రిక్షాలను ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతులమీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. కానీ అవి కార్మికులు తమ స్వంత డబ్బులతో రిపేరు చేయించుకున్న తరువాతనే రిక్షాలను కార్మికులకు అందించారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్(Gunjapadugu Hariprasad) ఆరోపించారు.

కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు ప్రజాధనంతో కొనుగోలు చేసిన రిక్షాలు కార్మికుల చేతుల్లోకి వెళ్లక ముందే మరమ్మతులకు గురి అవుతూ ఉన్నాయంటే అసలు కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించారు అని ప్రశ్నించారు. బిజెపి పాలనలో ఎక్కడ అవినీతి లేదని చెప్పడం సిగ్గుచేటని వారు అన్నారు. ప్రజాధనంతో  రిక్షాలు కొనుగోలు చేసి వాటి రిపేర్ ఖర్చును కార్మికుల వద్ద  వసూలు చేయడం కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులకే చెల్లిందని ఆరోపించారు. నాసిరకం రిక్షాలు అంటగట్టి ప్రజాధనం దోపిడీ చేస్తామని చూస్తే తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకునేది లేదని దీనిపైన ఖచ్చితంగా మేము దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేస్తామని  అన్నారు.

మరిన్ని వార్తలు