9 April, 2026 | 4:24 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

09-04-2026 01:30 AM

చేవెళ్ల ఎమ్మెలే కాలే యాదయ్య

శంకర్ పల్లి; ఏప్రిల్ 08.(విజయ క్రాంతి): పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెలే కాలే యాదయ్య అన్నారు.బుధవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శంకర్ పల్లి మండలం ,మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 47 మందికి రూ.20,68,000 చెక్కులను, అలాగే కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం కింద 50 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 50,05,800 చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం నిజమైన ఆశాకిరణంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్మెన్ సాత ప్రవీణ్ కుమార్, స్థానిక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, తాసిల్దార్ సురేందర్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.