ఈ సినిమాకు హైలెట్ కిటికీ ఎపిసోడే..
వీరు వులవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురు షః’. ఈ చిత్రంతో పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. సప్తగిరి, కసిరె డ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. మే 22న విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వీరు మీడియాతో పంచు కున్నారు.. “ఈ కథను ఎంతో మందికి వినిపించా. ఇలాంటి సినిమా అయితేనే కుటుంబ ప్రేక్షకులకు మా అబ్బాయి రీచ్ అవుతాడని కోటేశ్వరరావు దీన్ని ఓకే చెప్పారు.
సినిమా చూసిన తర్వాత కోటేశ్వరరావు నన్ను పట్టుకుని ఏడ్చేశారు. ఇది నా 26 ఏళ్ల కల అని కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమ కోసం ఏమైనా చేసే ఓ మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సప్తగిరి, కసిరెడ్డి పాత్రలు వినోదం పంచుతాయి. వీటీవీ గణేశ్, అనంత శ్రీరామ్, వెన్నెల కిషోర్.. ఇలా ప్రతీ కారెక్టర్ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్‌తో కిటికీ వద్ద ఉండే ఎపిసోడ్‌కు థియేటర్‌లో అందరూ పగలబడి నవ్వేస్తారు. ఆ సర్‌ప్రైజ్ మూమెంట్ ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది.
ఆ కిటికీ ఎపిసోడ్ సినిమాకి హైలెట్. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే పాయింట్‌తో ముందు కథను ప్రారంభించా. భార్యాభర్తల మీదే కథ రాయాలనుకున్నా. అయితే ఫీమేల్ ఓరియెంటెడ్ కథలెన్నో వచ్చాయని, మేల్ ఓరియెంటెడ్‌గా దీన్ని తీర్చిదిద్దా. ప్రస్తుతం నా వద్ద యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జానర్లలో కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలోనూ కొన్నిచోట్ల హరర్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది” అని తెలిపారు.






