పార్టీ బలోపేతం కోసం యువజన కాంగ్రెస్ కష్టపడి పనిచేయాలి
జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఖాలీద్ అహ్మద్
ఖమ్మం, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం యువజన కాంగ్రెస్ నాయకులు కష్టపడి పని చేయాలని, పని చేసిన వారికి తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుందని పార్టీ జాతీయ కార్యదర్శి ఖాలీద్ అహ్మద్(National Youth Congress Secretary Khalid Ahmed) అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షులు నాగెండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జి వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, యువతను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే కార్యక్రమాలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు.