రెండు ఎస్బీఐ ఏటీఎంలలో చోరీ
- బురఖాలు ధరించి ఎంట్రీ
- గ్యాస్ కట్టర్లతో మిషన్లను పగలగొట్టిన దుండగులు
- 16 లక్షలు అపహరణ
- కొద్దిపాటి తేడా సమయంలోనే ఘటనలు
- కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి
- అంతర్రాష్ట్ర ముఠా పనేనని అనుమానాలు
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్ కమిషనరేట్(Karimnagar Commissionerate) పరిధిలో దోపిడీ దొంగలు శనివారం అర్ధరాత్రి దాటి న తర్వాత తిమ్మాపూర్ మండలంలోని ఎస్బీఐ ఎటీఎం(SBI ATM), కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలోని మరో ఎస్బీఐ ఏటీఎంలను కొద్దిపాటి తేడా సమయంలో కొల్లగొ ట్టి నగదును అపహరించుకుపోయారు. దుండగులు ఏటీఎం మెషిన్ల(ATM machines)ను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి నగదు అపహరించినట్లుగా ఘటన స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాలను(CCTV cameras) పరిశీలించగా స్కార్పియో వాహనంలో వచ్చి న దుండగులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర వైపు నుంచి వస్తూ మంచి ర్యాల, దుర్షేడ్, తిమ్మాపూర్ ఏటీఎంలలో కొల్లగొట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాల పై స్ప్రే చేసి కేబులు కట్ చేసి అనంతరం దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. బురఖాలు ధరించి మహిళల వేషధారణలో వచ్చిన దుండగులు ఎంతమంది అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలో ఏటీఎంలో రూ.8.50 లక్షలు, తిమ్మాపూర్ ఏటీ ఎంలో రూ.7.13 లక్షలు అపహరణకు గురైనట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పరిశీలించా రు. రూరల్ ఏసిపి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు పరారైన తీరును పరిశీలిస్తున్నారు.
అంతరాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు నిందితులు ఎటువైపు నుంచి వచ్చారు ఎటువైపు వెళ్లారని కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కరీంనగర్ రూరల్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.