30-01-2026 12:00:00 AM
నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. ఈ చిత్రంతో మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచ యం అవుతున్నారు. మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ఆర్యన్ రాజేశ్, ఆమని, శుభలేఖ సుధాకర్, శత్రు, రవివర్మ, నిఖిల్ దేవదూల, బేబీ శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నా రు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నీ మాయలో పడేట్టుగా..’ అనే పాటను రిలీజ్ చేశారు.
శేఖర్‌చంద్ర స్వరపర్చిన ఈ గీతాన్ని చైతు సత్సంగి రాయగా రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ ఆలపించారు. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్ చేసే ఈ పాటలో నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర; డీవోపీ: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి; ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్; ప్రొడక్షన్ డిజైన్: రఘు కులకర్ణి; నిర్మాతలు: మురళి కమ్జుల, వంశీ కాంజుల; కథ, -స్క్రీన్‌ప్లే, -మాటలు-, దర్శకత్వం: మురళి కాట్రగడ్డ.