హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత
హైదరాబాద్ సెప్టెంబర్, 26(విజయక్రాంతి): హైదరాబాద్ నగరం(Hyderabad City)లో సామూహిక వినాయక నిమజ్జన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నిమజ్జన కార్యక్రమాలు చివరి దశలో ఉండటంతో సచివాలయం పరిసరాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షల(Traffic restrictions)ను అధికారులు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్, లిబర్టీ, అసెంబ్లీ, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో దశలవారీగా ఆంక్షలను తొలగిస్తున్నారు.నగరంలో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.