గిరిజన తండా.. సమస్యలే నిండా!

23-09-2026 | 05:10am
  1. మౌలిక వసతుల లేమితో సూర్యానాయక్ తండా వాసుల అవస్థలు
  2. ఎమ్మెల్యే సామేలు సహకారంతో అభివృద్ధికి సర్పంచ్ కృష్ణ ప్రయత్నాలు
  3. అభివృద్ధి చేయాలని గిరిజనుల వేడుకోలు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 22 : స్వాతంత్రం వచ్చి78 ఏళ్లు గడిచినా,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం(Separate state of Telangana) ఏర్పడి దశాబ్ద కాలం దాటిన ఇంకా అభివృద్ధి ఫలాలు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలంలోని సూర్యానాయక్ తండా గిరిజన గ్రామపంచాయతీ(Suryanayak Thanda Tribal Gram Panchayat). ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైన సూర్యానాయక్ తండా ఆ వాస గ్రామపంచాయతీలో 1150మంది జ నాభా,750 మంది ఓటర్లు,350 గిరిజన కుటుంబాలు ఉన్నా...ఈ గిరిజన తండా నేటికీ కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోక నిర్లక్ష్యానికి గురైంది.

కన్న తల్లిదండ్రుల కష్టంతో ఉన్నత చదువులు చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగాన్ని(Government job) వదిలి,తన కన్న ఊరిని బాగు చేసుకోవాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా బాధ్యతలు చేపట్టిన యువ సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నారు.

దయనీయంగా విద్యా వ్యవస్థ

గ్రామంలో ఉన్న ఏకైక ప్రాథమిక పాఠశాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉం ది. పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో సాయంత్రం వేళల్లో ఆకతాయి లు చేరి పాఠశాలలో ఫర్నిచర్, సామాగ్రిని ధ్వంసం చేస్తున్నారు. పగటిపూట పశువులు పాఠశాల ఆవరణలోకి చేరి పేడ, మూత్రం తో అపరిశుభ్రతకు నిలయంగా మార్చుతున్నాయి. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు.గ్రామంలో అంగన్వాడి సొంత భవనం లేకపోవడంతో ఇదే పాఠశాలలో ఉన్న ఒక గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

యువతకు ఉపయోగపడేలా క్రీడా ప్రాంగణనాన్ని ఏర్పాటు చేసినట్లు బోర్డులు దర్శనమిస్తుంన్నాయి తప్పా ...క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో సమావేశాలు నిర్వహించుకోవడానికి సైతం గిరిజన తండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల తండావాసులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక విలవిలలాడుతున్నారు.

డ్రైనేజీ లేమితో వర్షం వస్తే భయం 

సూర్యానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఆవాస గ్రామాలైన వీర్యానా యక్ తండా,గణ్యానాయక్ తండా గ్రామా ల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.చిన్నపాటి వర్షం వస్తే రోడ్లన్నీ జలమయమై, ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో పేద గిరిజన కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విషపురుగుల సంచారంతో పాటు విష జ్వరాల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. దీంతో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

అదేవిధంగా వెయ్యికి పైగా ఉన్న గ్రామపంచా యతీకి స్వచ్ఛమైన త్రాగునీరు అందించుట కు ప్రభుత్వం వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చే సి గిరిజనుల దాహార్తిని తీర్చాలని ప్రాధేయపడుతున్నారు.అలాగే గ్రామానికి 2 కిలోమీ టర్ల దూరంలో ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లి రేషన్ సరుకులు తీసుకుంటున్నామని, 350 రేషన్ కార్డులు ఉన్న సూర్యానాయక్ తండా గ్రామపంచాయతీకి వెంటనే నూతన రేషన్ షాపును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

లింక్ రోడ్డుతో తగ్గనున్న దూరం

 సూర్యానాయక్ తండా గ్రామపంచాయతీ నుంచి గణ్యానాయక్ తండా వరకు కే వలం 800 మీటర్ల దూరం లింకు రోడ్డు ని ర్మిస్తే 3 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని, ఫలితంగా ఉపయోగకరంగా ఉం టుందని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు. తిమ్మాపురం-సంగెం ప్రధాన రహదారి నుం డి సూర్యానాయక్ తండా మీదుగా వీ ర్యానాయక్ తండా వరకు గుంతలమయంగా ఉన్న బీటీ రోడ్డును వెంటనే రెన్యువల్ చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎమ్మెల్యే కృషితో గ్రామం అభివృద్ధి

మా గిరిజన గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు దృష్టికి తీసుకువెళ్లాను. ఆయన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు మా ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కనుక సానుకూలంగా స్పందించి ఒక్కొక్కటిగా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్నారు.త్వరలోనే గ్రామంలో వాటర్ ప్లాంట్, డ్రైనేజీ, లింక్ రోడ్లు, బీటీ రోడ్డు రెన్యువల్, నూతన గ్రామపంచాయతీ భవనం, రేషన్ షాపు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారం, గ్రామస్తుల అండదండలతో సూర్యానాయక్ తండా గ్రామపంచాయతీని నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా.

లూనావత్ కృష్ణనాయక్, సర్పంచ్ సూర్య నాయక్ తండా 

సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నయ్.. 

 మా గిరిజన గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి.స్థానిక ఎమ్మెల్యే మా గ్రామపంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి,ఉన్నత విద్యావంతుడైన సర్పంచ్ కృష్ణనాయక్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పథంలో నడిచే విధంగా చూడాలని గిరిజన బిడ్డగా వేడుకుంటున్నాను.          

 లూనావత్ నాగులు, గ్రామస్తుడు

మరిన్ని వార్తలు