టీ ఎస్ యుటిఎఫ్ ఏడవ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు
చుంచుపల్లి, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(Telangana State United Teachers Federation) ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే రాష్ట్ర మహాసభలు ఈ సంవత్సరం 2026 డిసెంబర్ 26,27,28 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గల కొత్తగూడెం క్లబ్ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం విద్యానగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు బి మురళీమోహన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ లు పాల్గొని మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగం మునుగడ కోసం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిరంతరాయంగా పనిచేసే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభలు విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
7వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ వివరాలు.
గౌరవాధ్యక్షుడు: కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
అధ్యక్షులు: కోనేరు పూర్ణచంద్రరావు
కార్యనిర్వాహక అధ్యక్షులు: బి రాజు
ప్రధాన కార్యదర్శి: ఎం వెంకటేశ్వర్లు,
కోశాధికారి :బి మురళీమోహన్. చీప్ ప్యాట్రన్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, , డిప్యూట్ మేయర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.