4 September, 2026 | 12:35 PM

TTD డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

03-09-2026 | 09:51am

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanamsడిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అరెస్ట్ చేసింది. లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి వరకు ఏసీబీ సోదాలు జరిగాయి. ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో(Nellore ACB Court) లోకనాథంను ఏసీబీ అధికారులు హాజరుపర్చనున్నారు. లోకనాథం(TTD Deputy EO Lokanatham arrested) ఇంట్లో రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు.


2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరిట 4 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలో శ్రీనివాసనగర్ లో ఫ్లాట్, గొల్లవారిగుంటలో 2 ఇళ్లు గుర్తించారు. మడమాలపేట మండలం పాదిరేడులో ఇల్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో(Tirumala adulterated ghee case) చిన్నఅప్పన్న విచారణ అంశాల ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేశారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు.


ఇవి కూడా చదవండి: 

ఏసీబీకి చిక్కిన టీటీడీ డిప్యూటీ ఈవో

భీమేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు