13 July, 2026 | 1:13 PM

కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

13-07-2026 12:40 PM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఖమ్మం, (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (Telangana Working Journalists Federation) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందించాలని, ఆర్టీసీ బస్సు పాసులతో పాటు మెట్రో పాసులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొద్ది మందికే అక్రిడిటేషన్లు ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు