6 September, 2026 | 11:37 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

06-09-2026 | 09:40am

ఎర్రవల్లి, సెప్టెంబర్ 06:  జోగులాంబ గద్వాల జిల్లా ఎన్‌హెచ్‌–44పై(Jogulamba Gadwal District NH-44) ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్త్ పఠాలం ఎదురుగా హెచ్‌పీ పెట్రోల్‌ పంప్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మౌనిక, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. కారును ముఖేష్ నడుపుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు