లంబోదరుడికి 108 రకాల నైవేద్యాలు
20-09-2026 | 06:49pm
గంభీరావుపేట, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట(Gambhiraopet) మండల కేంద్రంలో లంబోదరుడు విశేష పూజలు అందుకున్నారు. లంబోదర యూత్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో గణపయ్యను కొలిచారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగంగా గణనాథుడికి భక్తులు 108 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించి స్వామివారిని ఘనంగా అలంకరించారు.పూజల అనంతరం భక్తులు సంకీర్తనలు నిర్వహించగా, చిన్నారుల ఆటపాటలతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.