త్రిషపై ఉదయనిధి ద్వంద్వార్థ వ్యాఖ్యలు
కావేరీ జల వివాదంపై ప్రసంగిస్తూ నోరు జారిన నేత
సోషల్ మీడియాలో వీడియో
వైరల్.. రాజకీయ దుమారం
ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావు: ఉదయనిధి
చెన్నై, ఆగస్టు ౩: సినీ నటి త్రిషపై తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉదయనిధి సోమవారం తంజావురులో డీఎంకే నేతలు నిర్వ హించిన కావేరీ జలాల సాధన ర్యాలీలో పాల్గొన్నారు.
జలాల వివాదంపై ఆయన ప్రసంగిస్తుండగా, సభలో ఉన్న కొందరు ఒక్కసారిగా ‘త్రిష.. త్రిష’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని పక్కన పెట్టి, త్రిషపై ద్వంద్వార్థం వచ్చేలా ‘కావేరి జలాలు వస్తాయో రావో తెలియదు గానీ, ‘దాహం’ తీర్చేందుకు ఆ జలం మాత్రం అక్కడికి వెళ్లాల్సిందే.. సీఎం విజయ్‌కి కావాల్సిందీ అదే.. నేను కావేరి జలాలే గురించే అన్నాను’ అని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలకు సం బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ఉదయని ధిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేత నారాయణన్ తిరుపతి స్పందిస్తూ.. ‘బాధ్యత గల ఒక ప్రతిపక్ష నేత ఇలాంటి చవక బారు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, సంస్కారం ఉన్నవారెవరూ అలాంటి వ్యాఖ్య లు చేయరని మండిపడ్డారు. మరో బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు మహిళా నేతలు సైతం ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. విమర్శలపై ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు.






