రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్

21-09-2026 | 05:10am
  1. ఎన్నికల వేళ రాత్రంతా 1600కు పైగా డ్రోన్లతో దాడి
  2.    1,100 డ్రోన్లను కూల్చేసిన మాస్కో 
  3. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
  4. చమురు కర్మాగారంలో మంటలు

మాస్కో, సెప్టెంబర్ 20: ఎన్నికల వేళ రష్యా(Russia)పై ఉక్రెయిన్(Ukraine) విరుచుకుపడుతోంది. రాత్రికిరాత్రే 1600కు పైగా డ్రోన్ల(Drones)తో మాస్కో(Moscow)పై ప్రయోగించింది. చమురు, లాజిస్టిక్స్ కేంద్రాలపై ఫ్లెమింగో, పెలికాన్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడులతో చమురుశుద్ధి కర్మాగారం(Oil refinery)లో, ఒక భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పొగలు పైకి లేచాయి. చుట్టుప్రక్కల నివాసిత ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇద్దరు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు.

రష్యా రాజధానిపై ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్దదని మాస్కో మేయర్ వెల్లడించారు. అయితే దేశ రాజధాని మాస్కోవైపు వస్తున్న 450 డ్రోన్లతో సహా మొత్తం 1,100 డ్రోన్లను కూల్చేశామని పేర్కొన్నారు. క్రెమ్లిన్ తన పార్లమెంటరీ ఎన్నికలు ముగుస్తున్న చివరి రోజు ఉక్రెయిన్ దళాలు రాత్రికి రాత్రే రష్యాపై 1,000కి పైగా డ్రోన్లను ప్రయోగించాయని, వాటిలో వందలాది డ్రాఓన్లు మాస్కో లక్ష్యంగా ప్రయోగించారని అధికారులు ఆదివారం తెలిపారు.

ఈ డ్రోన్ల దాడిని రష్యా రాజధానిపై జరిగిన ‘ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద‘ దాడిగా మాస్కో మేయర్ అభివర్ణించారు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 20 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపారు. రష్యా చమురు, లాజిస్టిక్స్ కేంద్రాలపై ఫ్లెమింగో, పెలికాన్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థపై కీవ్ పెట్టాలనుకుంటున్న ఆర్థిక ఒత్తిడి ఇదేనని, ఆ దేశ యుద్ధ యంత్రాంగాన్ని నడిపించేవి ‘ఈ బిలియన్ల డాలర్లే’ అని ఆయన స్పష్టం చేశారు.

అయితే దేశ వ్యాప్తంగా, అలాగే స్వాధీనం చేసుకున్న ఉక్రేనియన్ ద్వీపకల్పమైన క్రిమియా, నల్ల సముద్ర జలాలపై తమ బలగాలు 1,100 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అఆగే రష్యా రాజధాని వైపు వస్తున్న 450 డ్రోన్లను మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలిపారు.

చమురు కర్మాగారంలో ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణనష్టం సంభవించలేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. 21 అంతస్థుల భవనాన్ని పలు డ్రోన్లు ఢీకొనడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని అందులో ఉన్న 70 మంది చిన్నారులతో సహా 400మందిని సురక్షితంగా తరలించామన్నారు. మాస్కోపై జరిగిన ఈ అతిపెద్ద దాడి ఎన్నికలకు అంతరాయం కలిగించే ఉక్రెయిన్ వ్యూహమేనని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు