ఫిట్నెస్ లేని లైన్‌మన్‌లు
- విద్యుత్ స్తంభాలు ఎక్కలేక అసిస్టెంట్ల ఏర్పాటు
- ప్రమాదవశాత్తు మరణిస్తే పట్టించుకోని అధికారులు
- అవగాహన లేక షాక్‌తో మరణిస్తున్న నిరుద్యోగులు
- మృతుని బంధువులతో బేరసారాలతో మమ అనిపిస్తున్న అధికారులు
- ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నా పట్టించుకోని యాజమాన్యం
మేడ్చల్ అర్బన్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి:) విద్యుత్ విభాగంలో(Electrical Department) పనిచేసే వారు ప్రతి క్షణం ప్రమాదపు అంచులపై(edge of danger) ప్రయా ణం చేస్తుంటారు.అందుకే విద్యుత్ ఉద్యోగుల వేతనాలు(Electricity employee salaries) ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనంతం గా చెల్లిస్తున్నారు.ఒక్కొక్క సీనియర్ లైన్మెన్(Senior Lineman), లైన్ ఇన్స్పెక్టర్ ల వేతనాలే నెలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు పైగా ఉండడం గమనార్హం.అంత పెద్ద ఎత్తున వేతనాలు తీసుకుంటున్న సదరు ఉద్యోగులు క్షణంలో ఎ లాంటి పనినైనా చేయడానికి సిద్ధంగా ఉం డాలి.
అవసరమైతే అర్ధరాత్రి విద్యుత్ స్తంభంపై ఎక్కి విద్యుత్ మరమ్మతు పనులు చేసి వినియోగదారులకు విద్యుత్ సరఫరాను(Power supply) పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ లలో 80శాతం మంది,లైన్మెన్ లలో 50 శాతం మంది విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.ఫిట్నెస్ లేక విద్యుత్ స్తంభం ఎక్కలేని,దిగలేని పరిస్థితుల్లో వారికి మరో ప్రైవేట్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేసుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారుతుంది.అనుభవం లేని నిరు ద్యోగ యువత ఆశతో వచ్చి కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అంతేకాకుండా వారికి ఇ టు సంస్థనుంచి కానీ,ఎటు వంటి వారిని ఏ ర్పాటు.చేసుకున్న లైన్మెన లైన్ ఇన్స్పెక్టర్ ల నుంచి ఎలాంటి సహకారం లేక వారికి కుటుంబాలు రోడ్డున పడుతున్న తీరు బాధాకరం.
విధి నిర్వహణలో ఫిట్ గా లేని లైన్‌మన్, లైన్ ఇన్స్‌స్పెక్టర్‌లు :
లైన్మెన్,లైన్ ఇన్స్పెక్టర్,ఆర్టిజన్,ఫార్మెన్లు అ న్ ఫిట్ గా మారుతున్నారు.స్వయంగా స్తం భాలను ఎక్కి దిగలేకపోతున్నారు.వృద్ధాప్యం కారణంగా కొంతమంది విద్యుత్ స్తంభాలు ఎక్కి దిగలేకపోతుంటే.రోజువారీ ప్రాక్టీస్ లేక మరికొంత మంది దూరంగా ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అమాయక నిరుద్యోగులను అసిస్టెంట్లుగా నియమించుకుని గు ట్టుగా వారితో సంస్థ పనులు చేయిస్తున్నా రు. ప్రమాదవశాత్తూ కార్మికుడు మృతి చెం దితే.తీరా తమకేమి సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇటీవల కాలంలో కండ్లకోయ నుంచి సాయిగీతా ఆశ్రమం దారిలో విద్యుత్ శాఖ అధికారులు చెట్లకొమ్మలు కత్తిరించే సమయంలో నల్గొండ జి ల్లా, నారాయణపూర్ మండలం చిల్లపురం గ్రామానికి చెందిన కొర్ర జగ్రాం(46) హై టెన్షన్ వైర్లు తగిలి కింద పడిపోయాడు.కండ్లకోయ సీఎంఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే జగ్రాం మృతి చెందాడని తమకు న్యా యం చేయాలని కోరుతూ మృతుడి కుటుం బ సభ్యులు,మృతదేహాన్ని తరలించకుండ ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు.
ఉన్నతాధికారులు,పోలీసులు చేరుకుని కుటుంబ సభ్యు లతో మాట్లాడారు.ఇదిలా ఉండగా మేడ్చల్, అత్వెల్లి,కిష్టాపూర్ సబ్ స్టేషన్ ల పరిధిలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూ నే ఉన్నాయి.కొంత మంది అమాయకులు గాయాలపాలు కాగా మరికొంత మంది మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి కానీ ఇందుకు బాధ్యులైన ఎఈ, రెగ్యులర్ లైన్మెన్ లపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.కనీసం ఉన్నతాధికారుల పంచనామాలో వారి పేరు కూడా కనిపించడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
మేడ్చల్ డివిజన్ ల పరిధిలో పనిచేస్తు న్న రెగ్యులర్ జేఎల్‌ఎంలు,లైన్ ఇన్స్పెక్టర్లు, ఆర్టిజన్ లను ఫోర్మెన్ లను ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎప్ప టికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి,ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం సిబ్బం ది పనితీరును పరిశీలించాల్సిన ఏఈ,ఏడీఈ, డీఈలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేద నే విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. జూనియర్ లైన్మెన్ పోస్టింగ్ వచ్చిన కొత్తలో నెలవారి జీతం రూ.40వేల వరకు ఉంటుం ది. సీనియార్టీని బట్టి రూ.1.50లక్షలు పైగా తీసుకుంటున్నారు.నిజానికి వీరు ఉద్యోగం లో జాయిన్ అయిన తర్వాత వీరికి సెక్షన్ ఆ ఫీసులో పోల్ ఎక్కే విధానం లేకుండాపోయింది.
మీటర్ రీడింగ్,డిస్ కనెక్షన్ (డిలిస్ట్) సర్వీసులకే పరిమితం అవుతున్నారు.మెజార్టీ ఫోర్మెన్ లకు కనీసం కటింగ్ బ్లేడ్ పట్టడం కూడా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వ ర్కులు పూర్తిగా ప్రైవేటు కాంట్రాక్టర్ లకు రా వడం లేదు.రోజువారీ ప్రాక్టీస్ లేకపోవడం తో మెజార్టీ జేఎల్‌ఎంలు పోల్స్ ఎక్కడం మానేశారు.అవసరానికి మించి వేతనాలు ఉండటం కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం పెరగడానికి మరో కారణం.అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులతో పనిచేయిస్తున్నా రు. సంస్థ ఉద్యోగులు చేయాల్సిన పనులకు రోజువారీ కూలీలతో చేయిస్తున్నారు. విద్యు త్ లైన్లు,సరఫరా వ్యవస్థపై వారికి సరైన అవగాహన లేక విద్యుత్ ప్రమాదానికి గురై మృ త్యువాత పడుతున్నారు.
ఎల్సీలు తీసుకున్నప్పటికీ ఇంట్లోని ఇన్వెర్టర్ ల,జనరేటర్ ల నుంచి లైన్ కు రిటర్న్ కరెంట్ పాస్ అవుతోంది.ఈ విద్యుత్ ప్రమాదాలపై ఏడీఈ, డీఈ ఇచ్చే ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు ఎఫ్‌ఎఐఆర్ నమోదు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు కార్మికులతో పని చేయించినట్లు ధృ వీకరిస్తే..రెగ్యులర్ ఉద్యోగికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ విషయాన్ని వారు దా చిపెట్టి మృతుల బంధువులతో బేరసారాల తో సరిపెడుతున్నారు.వీరంతా ఇతర ప్రాం తాల నుంచి పొట్ట చేతపట్టుకుని బతుకుదెరు వు కోసం వచ్చిన వారుకావడంతో చేసేది లే క వారు కూడా ఇచ్చింది తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.ఈ విషయం యాజమాన్యానికి తెలిసి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.