ఆయా పోస్ట్‎పై రగడ...విచారణకు డిమాండ్

21-09-2026 | 01:26pm

అశ్వాపురం,సెప్టెంబర్ 21(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రం(Anganwadi Centre)లో ఆయా పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ను సక్రమంగా ప్రచురించకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై అమ్మగారిపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తల్లుల కమిటీ సభ్యులు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్ ఐసీడీఎస్(TS ICDS) ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు.

గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై సక్రమంగా ప్రదర్శించకపోవడంతో అర్హత కలిగిన మహిళలకు సమాచారం అందలేదని, ఒకరికి మాత్రమే సమాచారం అందించి ఆమెతో దరఖాస్తు చేయించినట్లు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆయా ఎంపిక ప్రక్రియను నిలిపివేసి, నోటిఫికేషన్‌ను బహిరంగంగా ప్రచురించి అర్హులైన మహిళలందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన అనంతరం నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా ఎంపిక చేపట్టాలని వారు కోరారు. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు