ఉస్తాద్ ఉత్సాహం!
08-03-2026 01:03 AM
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. అయితే, అంతకన్నా ముందే టీమ్ శనివారం ఈ మూవీ నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కథనం: కే దశరథ్, రమేశ్ రెడ్డి; సంగీతం: దేవిశ్రీప్రసాద్; నేపథ్య సంగీతం: తమన్; ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ; కూర్పు: కార్తిక శ్రీనివాస్; కళ: ఆనంద్ సాయి.




