8 March, 2026 | 4:18 AM

ప్రతీకారం తీర్చుకునే రంగీ

08-03-2026 01:05 AM

రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ధురంధర్: ది రివెంజ్’. ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత దానికి సీక్వెల్ రాబోతోందీ సినిమా. ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్యధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేశ్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆర్ మాధవన్, అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జియో స్టూడియోస్ సమర్పణలో, బీ62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ పాత్రలో మరోసారి తీవ్రతతో కనిపించారు. ఈసారి ఆయన జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాలు, పదునైన డైలాగ్స్, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ విజిల్స్ వచ్చేలా చేసే సన్నివేశాలతో ట్రైలర్ మొత్తం ఒక భారీ రివెంజ్ సాగాకు నాంది పలుకుతోంది.