బస్వాపూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంకా రాజేశ్
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkhunur Mandal) బస్వాపూర్ గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ యువజన కాంగ్రెస్(Youth Congress) అధ్యక్షుడిగా వంకా రాజేశ్‌ను నియమించారు. ఉపాధ్యక్షుడిగా సాకలి రమేశ్, ప్రధాన కార్యదర్శులుగా వంకా తరుణ్, ఎరుకల చంద్రం, కార్యదర్శులుగా డప్పు నితిన్, ఎర్రోళ్ల అక్షయ్, కోశాధికారిగా జుట్టరాజు, ముఖ్య సలహాదారులుగా కమ్మరి ఈశ్వరయ్య, నాగని నందు నియమితులయ్యారు.
సలహాదారులుగా వంకా వరుణ్, నాగని వేణు, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రామగల్ల అక్షయ్‌ను నియమించారు. ఈ సందర్భంగా భిక్కనూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ వంకా రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని, యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహించాలని ఆయన సూచించారు.