21 August, 2026 | 4:57 PM

ప్రముఖ సీనియర్ నటి 'షావుకారు' జానకి కన్నుమూత

21-08-2026 03:35 PM

చెన్నై: చిత్ర పరిశ్రమలో(Film industry) శుక్రవారం నాడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(Veteran Actress Sowcar Janaki Passes Away) కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి((Veteran Actress Sowcar)) తుది శ్వాస విడిచారు. వయోభారం, శ్వాసకోశ సమస్యలతో షావుకారు జానకి మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడలో 400 లకు పైగా సినిమాల్లో జానకి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ , శివాజీ గణేశన్ తో హీరోయిన్ గా కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో జానకి చివరిసారిగా కనిపించారు.

1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జిన్మించిన షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1950లో షావుకారు చిత్రంలో కథానాయికగా జానకి సినీరంగ ప్రవేశం చేశారు. 73 ఏళ్లుగా తెలుగునాట సుపరిచితమైన సినీయర్ నటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత జానకి సొంతం. షావుకారు జానకి డైలాగ్స్ తీరుకు ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. తొలినాళ్లలో రేడియో నాటకాలతో జానకి మంచి పేరుతెచ్చుకున్నారు. బీఎన్ రెడ్డి తొలి చిత్రం షావుకారు సినిమాలో జానకికి అవకాశం ఇచ్చారు. 'సంసారం ఒక చదరంగం' సినిమాలో చిలకమ్మ పాత్రలో జానకి నటించి మెప్పించారు. జానకి కూతురు ను హీరోయిన్ గా చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు.

హీరోయిన్ కృష్ణకుమారి.. షావుకారు జానకికి స్వయానా చెల్లెలు. జానకి 1955లో ఏకంగా 11 చిత్రాల్లో నటించి మెప్పించారు. 1952లో తమిళ చిత్రం 'వలయ పతి'లో జానకి నటించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'ఏదినిజం' సినిమాకు జాతీయ బహుమతి అందుకున్నారు. 1962 తర్వాత సహాయ చిత్రాల్లో ఆమె నటించారు. 2022లో షావుకారు జానకికి పద్మశ్రీ పురస్కారం వరించింది. షావుకారు జానకి కళైమామణి, నంది, రాజ్యోత్సవ అవార్డులు, సైమా లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు. షావుకారు జానకి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.