30-08-2025 08:03:44 PM
పంచాయతీ కార్యదర్శి పని తీరుపై ఎంపీడీఓకి పిర్యాదు
అదిలాబాద్,(విజయక్రాంతి): బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో మంజూరైనా 40 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల ఫోటో కాప్చరింగ్ సంబంధిత పంచాయతీ కార్యదర్శి చేయక పోవడంతో గ్రామ మహిళలు బేలా ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఇన్ని రోజులు ఫోటో కాప్చరింగ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని అధికారులను నిలదీశారు.
దింతో ఎంపీడీఓ మహేందర్ కుమార్ ఆందోళన కారులు వద్దకు వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుండి తానే స్వయంగా వచ్చి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇండ్ల ఫొటోస్ తీస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, కానీ పంచాయతీ కార్యదర్శి ఇతరుల మాటల విని ఫోటోలు తీయడం లేదని అన్నారు. పంచాయతీ కార్యదర్శి తమ తీరును మార్చుకోవాలని ఈ సందర్బంగా కోరారు.