calender_icon.png 31 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యంతరాలుంటే తెలియజేయాలి

30-08-2025 08:02:36 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎంపిడీఓ ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) సమావేశం నిర్వహించారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉన్నచో తెలియజేయవలసినదిగా కోరారు. చనిపోయిన వారి పేర్లు గ్రామాలు వదిలి వెళ్ళిన వారి పేర్లు తొలగించే విధంగా చూడాలని కోరారు. ఓటర్లు భార్య ఒక వార్డులో భర్త మరో వార్డులో వార్డుల వారిగా ఇలా తప్పిదాలు ఉంటే ఒకే వార్డులో చేర్చుకునేందుకు గ్రామ కార్యదర్శి వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 22 గ్రామ పంచాయతీల సంబంధించిన ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఇట్టి విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేస్తానని ఎంపిడిఓ పలు పార్టీల నాయకులకు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీఓ గౌరీ శంకర్, ఏపీవో రాజన్న పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.