వినాయక చవితి ఎఫెక్ట్.. పండగ ప్రయాణాలు షురూ

11-09-2026 | 05:05pm

హైదరాబాద్: హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. వరుస సెలవులు, వినాయక చవిత నేపథ్యంలో  సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో ఎంజీబీఎస్(MGBS), జేబీఎస్(JBS) బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ రద్దీ దృష్ట్యా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు.



మరిన్ని వార్తలు