20 May, 2026 | 7:41 PM

వారసంతలో గిద్దల పోట్లాట.. ఇబ్బందులు పడ్డ జనం..

20-05-2026 06:28 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లోని వారసంతలో  బుధవారం సాయంకాలం  ఒకపక్క జనం కూరగాయలు, నిత్యవసర సరుకులు  కొనుగోలు చేస్తున్నారు.. అదే సమయంలో రెండు గిత్తలు   పోట్లాడుకోవడం తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాదాపు అరగంటసేపు  గిత్తలు పోట్లాడుకోవడంతో  కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల  కూరగాయలపై  గిత్తలు దూసుకు వెళ్ళాయి. రెండు గిత్తలు ఎక్కడ మాపై పడతాయని ప్రజలు ఇబ్బందులు పడుతూనే పరుగులు తీశారు. కొంతమంది వ్యాపారులు కరలతో కొట్టి  పోట్లాడుటను విడదీశారు. దీంతో ప్రజలు ఊపిరి తీసుకున్నారు.