నోటీసులతోనే కాలయాపన.. చర్యలేవీ?
- అయిజలో పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు..
- పర్యవేక్షణ కరువు
- గత ఫిర్యాదులపై చర్యలు లేవంటున్న తల్లిదండ్రులు
అయిజ, సెప్టెంబర్ 2౮: అయిజ పట్టణంలో విద్యా వ్యాపార కేంద్రంగా(Commercialized Education Hub) మారింది. అనుమతులు లేకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు యాజమాన్యాలు(Managements of private coaching centers) వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు అంతేకాక విద్యాశాఖ అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురుకుల, నవోదయ సీటు(Gurukul or Navodaya seat) గ్యారంటీ పేరుతో తల్లిదండ్రు లను ఆకర్షిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. వీటిపై అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను తేల్చాలని త ల్లిదండ్రులు కోరుతున్నారు.
పర్యవేక్షణ ఏదీ?
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో(Government and private schools) చదువుతున్న విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాఠశాలల పనివేళలు, విద్యార్థుల హాజరు, కోచింగ్ సమయాలు నిబంధనలకు అ నుగుణంగా ఉన్నాయా? రాత్రి వేళల్లో తరగతులు నిర్వహిస్తున్నారా? అనే అంశాల ను అధికారులు పరిశీలించాల్సి ఉంది.
నోటీసులకే పరిమితమా?
గతంలో ఓ కోచింగ్ సెంట్ప గతంలో ఫిర్యాదులు, పత్రికా కథనాల నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స మాచారం. పాఠశాలల పనివేళల్లో తరగతు లు నిర్వహించబోమని యాజమాన్యం స మాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత తనిఖీలు జరిగాయా? నిబంధనలు అమలవుతున్నాయా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఎంఈఓ సమాధానంపై విమర్శలు
ఈ విషయమై ఎంఈఓ రాముదయాల్ను వివరణ కోరగా.. పత్రికల్లో ప్రచురితమైన అ ంశాల ఆధారంగా కలెక్టర్ లేదా డీఈఓ నుం చి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అయితే నిబంధనల అమలును పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదేనని, ఆదేశాల కోసం ఎదురుచూడకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.