calender_icon.png 21 February, 2026 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని అభివృద్ధికి సహకరించాలి

21-02-2026 03:49:01 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను శనివారం మంథని నూతన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డిలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టర్ ను కోరారు. నూతనంగా ఎన్నికైన  చైర్మన్, వైస్ చైర్మన్ లకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. మంథని మున్సిపాలిటీ అభివృద్ధికై పాలకవర్గానికి సహకరించాలని వారు కలెక్టర్ ను కోరారు. ఈ సందర్బంగా చైర్మన్, వైస్ చైర్మన్ పలు అభివృద్ధి పనుల గురించి జిల్లా కలెక్టర్ తో చర్చించారు. అనంతరం మంథని పట్టణ అభివృద్ధి కి సహకరిస్తానని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తెలిపారని వారు తెలిపారు.