ఆదివాసి ప్రజలను చిన్నచూపిస్తే సహించేది లేదు

20-09-2026 | 07:35pm

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి 

పినపాక, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆదివాసి ప్రజలను విస్మరించడమే కాకుండా చిన్న చూపు చూస్తున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి(Alem Koti) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడూళ్ళ బయ్యారం, గ్రామ పంచాయతీలో రెడ్డి సామజిక వర్గానికి చెందిన ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్‌ రెడ్డి, నాయకుడు గంగిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఆదివాసీలపై కుల వివక్షత(Caste discrimination) చూపిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.

పంచాయతీలో ఎలక్ట్రిషన్ వర్కర్ గా పనిచేసిన సనప శంకర్ కు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా, కాలయాపన చేస్తూ, బిల్లులు ఇచ్చేది లేదంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వర్కర్ కు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేంతవరకు పోరాడుతామని అన్నారు. ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీలో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా గంగిరెడ్డి వెంకట రెడ్డి, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్‌ రెడ్డి, వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆదివాసీలు, ఎస్సీలు, బిసి సామాజిక వర్గాన్ని అణగతోక్కుతున్నారని తెలిపారు. దీని మూలంగా వారు ఉన్న పార్టీకి చెడ్ట పేరు వస్తుందని తెలిపారు. గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ సందీప్‌ రెడ్డి, మాకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అండగా ఉన్నారని విర్రవీగుతున్నారని అన్నారు. మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ను బదానం చేయడమే కాకుండా, మమ్మల్ని ఏం చేయలేరంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. అమాయక ఆదివాసీల పేర్లు తో ,భద్రాచలం ఐటిడిఏ ద్వారా ట్రైకార్ తదితర లోన్ లు తీసుకొని రాజబోగల అనుభవిస్తున్నారని అన్నారు.

5వ షెడ్యూల్డ్ వివాదంలో 1/70, 1/77,పిఓటి,ఎల్టీఆర్, తదితర చట్టాలని ఉల్లంఘించమని గంగిరెడ్డి వెంకట్ రెడ్డి,సందీప్‌ రెడ్డి లకు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన,మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారా అని ప్రశ్నిస్తున్నాము అని అన్నారు. మండలంలో ఆదివాసీ సర్పంచ్ లను,ఏ మనిషిని ఏ రకంగా వాడాలో,తమ స్వార్ద ప్రయోజనాలు కోసం ,గంగిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని తెలిపారు.ఖబడ్దార్ గంగిరెడ్డి వెంకట్ రెడ్డి. నీ చిట్టా మా వద్ద ఉంది, తుడందెబ్బ మూడు రోజుల్లో తుడం మోగిస్తుంది అని హెచ్చరించారు. ఏడుల గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజా సొమ్మును కాజే చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి చెక్ పవర్ రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు