అనుమతుల్లేని ఫంక్షన్ హాళ్లపై చర్యలేవీ?

24-09-2026 | 05:05am
  1. ప్రజాధనానికి గండి కొడుతున్న బడా వ్యాపారులు
  2. చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారులు 

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండల(Ibrahimpatnam Mandal) పరిధిలో అక్రమ నిర్మాణాలు(Illegal constructions), అనుమతుల్లేని వ్యాపార సముదాయాలు విచ్చలవిడిగా వెలుస్తునా ్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఖాల్సా ఉప్పరిగూడ గ్రామం రెవెన్యూ(Uppariguda Village Revenue) పరిధిలోని పోచారం నుండి మంగళపల్లి వెళ్లే రహదారిలో, సీవీఆర్ కళాశాల సమీపంలో దాదాపు 30 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ‘రీవేరా‘ అనే ఫంక్షన్ హాల్ను(Riviera Function Hall) నిర్మించారు.

నిబంధనలను తుంగలోకి పెట్టి నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ప్రతి కార్యక్రమానికి రూ. 50,000 ను ండి రూ. 60,000 వరకు ప్రజల నుండి ద ర్జాగా వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామపంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లి ంచకుండా, పంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారు.

ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం..

ఈ అక్రమ నిర్మాణంపై ఇబ్రహీంపట్నం మండల ప్రజావాణిలో అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి లకు స్వయంగా వినతిపత్రాలు అందజేసినా పరిస్థితిలో మా ర్పు రాలేదని స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వ నిబంధనలను పూర్తిస్థాయిలో బేఖాతరు చేస్తూ, గ్రామపంచాయతీ ఆదాయాన్ని గండి కొడుతున్న ఈ అక్రమ ఫంక్షన్ హ్పా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల నుండి వేల రూపాయలు వసూలు చేస్తూ పన్నులు ఎగవేస్తున్న ఇటువంటి వ్యాపారాలపై అధికారులు ఉక్కుపా దం మోపి, పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలి‘ అని గ్రామ ఉపసర్ప ంచ్ కావ్య వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

అధికారుల పక్షపాత వైఖరిపై ప్రజల ఆగ్రహం..

సామాన్య ప్రజలు తమ సొంత స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే వెంటపడి నోటీసులు ఇచ్చే అధికారులు, కో ట్ల విలువైన స్థలాల్లో బడా వ్యాపారవేత్తలు భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా కనీ సం చూడకపోవడంలో అంతర్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల లో పభూయిష్ట వైఖరి వల్లే మండలంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూపెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి, తక్షణమే సదరు ఫంక్షన్ హాల్ను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు