ఏందయ్య సామీ పుల్ జోష్
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రశ్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ(Pan-India movie) ‘రణబాలి(Ranabali)’. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ‘రణబాలి’ సినిమా వరల్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘ఏందయ్య సామీ’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
‘రణబాలి’లో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా ‘ఏందయ్య సామీ..’ పాట చిత్రీకరించారు. పాటను అజయ్ అతుల్ మెలొడియస్‌గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. ‘ఏందయ్య సామీ..’ పాట ఎలా ఉందో చూస్తే -‘ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా..’ అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.