‘ట్రంప్ టీవీ’లో వైట్‌హౌస్ ప్రసారాలు

23-09-2026 | 05:05am
  1. మూడు ఛానెళ్లపై నిషేధం
  2. కోర్టుకెక్కిన మీడియా సంస్థలు
  3. ప్రతిష్ఠ దెబ్బతీసే వార్తలు, కథనాలపై ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: సీఎన్‌ఎన్, ఎంఎస్‌ఎన్ నౌ, పొలిటికోలకు చెందిన జర్నలిస్టుల(Journalists)పై వైట్‌హౌస్ నిషేధం(White House ban) విధించడంతో ఆ ఛానళ్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని(Live broadcast) పూర్తిగా నిలిపివేశాయి. ఇకపై అధ్యక్ష కార్యక్రమాల ప్రసారాలు ఉండవని ఫాక్స్ న్యూస్(Fox News) ప్రకటించింది. దీంతో వైట్‌హౌస్ వేదికగా ‘ట్రంప్ టీవీ’ని సొంత ఆన్‌లైన్ వీడియో ఫీడ్‌(Online video feed)తో ప్రారంభించారు. వైట్‌హౌస్‌లో నూతన హెలిప్యాడ్‌ను ట్రంప్ ప్రారంభించగా ఇందుకు సంబంధించిన వీడియోను ‘ట్రంప్ టీవీ’నే కవరేజ్ చేసి విడుదల చేసింది.

వీడియోలో స్పష్టత కరవైందని, ఇతర శబ్దాలు కూడా వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ పనితీరును తమ మీడియా పర్యవేక్షిస్తుందని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. కాగా మూడు మీడియా సంస్థల నిషేధం పట్ల అవి యూఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఈ వివాదంపై ట్రంప్ మాట్లాడుతూ.. మీడియా పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో కథనాలను ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. కథనాలపై ప్రశ్నించానని, పరువు నష్టం దావా కూడా వేశానని పేర్కొన్నారు. ఇక తన ప్రతిష్ఠ దెబ్బతీసే వార్తలు, కథనాలపై ఊరుకునేది లేదని ట్రంప్ హెచ్చరించారు. వైట్‌హౌస్‌లోకి ఈ మూడు చానళ్ల ప్రతినిధులపై నిషేధం విధించడంతో వివాదం చెలరేగింది.

మరిన్ని వార్తలు