పిడుగుపాటుకు మహిళ మృతి
20-09-2026 | 08:34pm
బేల సెప్టెంబర్ 20(విజయక్రాంతి):మండలం అవాల్పూర్ గ్రామంలో విషాద ఘటన బేల మండలం అవాల్పూర్ గ్రామంలో (Awalpur village) పిడుగుపాటు సంభవించి ఓ మహిళ మృతి చెందింది. సోడెం లత, భర్త సురేష్, వయస్సు 40 సంవత్సరాలు, వ్యవసాయ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న బేల ఎస్ఐ మధుకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుతో మహిళ మృతి చెందడంతో అవాల్పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.