30 August, 2026 | 9:55 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

30-08-2026 08:48 AM

జానంపల్లి సమీపంలో ఘటన. 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

గండీడ్‌, (విజయక్రాంతి): మండల పరిధిలోని జానంపల్లి గ్రామ సమీపంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయని. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నచేడ్‌ గ్రామానికి చెందిన నాగమణి జానంపల్లి సర్వీస్‌ రోడ్డు మీదుగా వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆమెను 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.