అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

17-09-2026 | 08:45am

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Peasant Armed Struggle) అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతున్న పోరు వనితల స్ఫూర్తి యాత్రలో భాగంగా జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం,అర్వపల్లి,కాసర్లపహాడ్ గ్రామాలలోని అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma),మల్లు స్వరాజ్యం,ఆరుట్ల కమలాదేవి వంటి వీరవనితల పాత్ర కీలకమన్నారు.వీర వనితల పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతోపాటు,వారి త్యాగాలను స్మరించుకోవడమే వీర వనితల స్ఫూర్తి యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు.ఆయా కార్యక్రమాల్లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి,సహాయ కార్యదర్శి సరళ,ఆశలత,ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి,నాయకులు కొరిశెట్టి యాదగిరిరావు,చెరుకు ఏకలక్ష్మీ,విజయలక్ష్మి,మట్టిపల్లి సైదులు,వజ్జె శ్రీనివాస్,ఎల్లెంల అవిలయ్య,శిగ శ్రీకాంత్,మచ్చ శ్రీవిద్య,వెంకన్న,అబ్బులు,కమ్యూనిస్టు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు